వ్యభిచార కార్యకలపాలు సిగ్గుచేటు

నల్లగొండ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి రావడం సిగ్గుచేటని బీజేపి నేత సంకినేని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. చిన్నారులను వ్యభిచార రొంపిలోకి దించడం క్షమించరాని నేరమన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతన్నా నేరాలు అదుపులోకి తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ముఠాలు రెచ్చిపోతున్నారని తెలిపారు. తెలంగాణలో అనేక మంది చిన్నారులు కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ ఇంత వరకు లభించలేదని కిషన్‌రెడ్డి అన్నారు. కిడ్నాప్‌ కేసులను తూతూ మంత్రంగా వదిలేస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలోనే కాదు ఇంకా అనేక చోట్ల ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.