వ్యవసాయం చేయాలన్న భరోసా కల్పించిన కెసిఆర్
రైతుబంధు దేశానికే ఆదర్శం: చందూలాల్
ములుగు,మే9(జనం సాక్షి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగహన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంతంరి చందూలాల్ అన్నారు. వ్యవసాయాన్ని పండుగల మార్చే దిశలో ముందుకు వెళ్లుతున్నారని ఆయన చెప్పారు. రైతుబందు పథకం గ్రామాల్లో సస్యవిప్లవానికి నాంది కానుందన్నారు. రైతులు విూసం మెలేసి వ్యవసాయం చేయాలని ధీమాగా చెప్పగలరని, ఆ ధైర్యం సిఎం కెసిఆర్ వల్లనే వచ్చిందన్నారు.
రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రైతుబంధు పథకం ఆమలులో భాగంగా ఈ నెల 10న టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే నూతన చరిత్రకు సృష్టించనున్నదని ఆయన అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సాయం అందించనున్న తొలి రాష్ట్రం తెలంగాణెళినని అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలన్న కేసీఆర్ తపనకు ఇదో ముందడుగు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం పెట్టుకున్నారని అన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతు సమస్యలను రూపుమాపేందుకు కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు దారి చూపుతాయన్నారు. దేశంలోనే మరే
రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ఆమలు చేస్తున్నారని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను ప్రతి ఒక్కరు ఇష్టపడి భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ముందుకు వెళ్లుతున్నారని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి రోజుకు ఆరు గంటలు కాదు.. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తూ సమైక్యవాదులు చెప్పింది నిజం కాదని నిరుపించారని అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఎరువులు, విత్తనాలు, రైతులకు అందుబాటులో పెడుతున్నారని అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.8వేలు సాయం అందేసే రైతుబంధు పథకం ప్రపంచంలోనే ప్రవేశ పెట్టడం తెలంగాణలోన ప్రథమమని అన్నారు.
—-