వ్యవసాయాన్ని పండగ చేస్తోన్న సిఎం కెసిఆర్
యాదాద్రి,మే8(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. కెసిఆర్ ముందుగా హావిూ ఇవ్వకున్నా వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4వేలు అందజేస్తున్నరని అన్నారు. రాష్ట్రాభివృద్ధే థ్యేయంగా అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే పేదింటి బ్రతుకుల్లో భరోసా వచ్చిందని, వారి వైద్యానికి కావాల్సినంత ఖర్చులు కేసీఆర్ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందుకే దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగానే పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఒక పెద్దన్నగా నిలబడి సహయం అందించాలనే ఉద్దేశ్యంతోనే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ముందుగా ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేసిన ప్రభుత్వం తర్వాత అన్ని వర్గాల వారికి వర్తింపజేసిందన్నారు.