*వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి,ఎరువులు, విత్తనాలు,పురుగు మందులు సబ్సిడీపై అందజేయాలి. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు*
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని వ్యవసాయ పెట్టుబడులపై సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి రక్షించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు అన్నారు.శనివారం నాడు నేరేడుచర్ల మండల రైతు సంఘం మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలోని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి విత్తనాలు ఎరువులు, పురుగుమందులు, సబ్సిడీపై అందజేయాలని రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ రేట్లు రోజురోజుకు పెరగటం ద్వారా వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్త రైతాంగ పోరాట ఫలితంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసిందని అన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్ట పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మహాసభకు పారేపల్లి శేఖర్ రావు అధ్యక్షత వహించగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి బ్రహ్మం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, సిఐటియు నాయకులు కందగట్ల అనంత ప్రకాష్ ,మొగిలిచర్ల రుద్రమ్మ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిరికొండ శ్రీను, రైతు సంఘం నాయకులు పాతూరి శ్రీను, సిఐటియు నాయకులు నీలా రామ్మూర్తి, కుంకు తిరుపతయ్య, చలసాని అప్పారావు, ఉప్పెల్లి వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ వెంకన్న మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.