వ్యవసాయ విద్యార్థులచే అవగాహన సమావేశం

వేములవాడ రూరల్, ఆగస్టు 21 (జనంసాక్షి):
వేములవాడ గ్రామీణ మండలంలోని మల్లారం, మారుపాక గ్రామాలలో సోమవారం వ్యవసాయ కళాశాల విద్యార్థుల “గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక మూల్యాంకన తులనం”కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని రైతు వేదికలో సామాజిక సంస్థలు, వనరులు, నేల రకాలు, పంట పొలాలు, పశువులు, వివిధ సమస్యలపై నేలపై చిత్ర పటాల ప్రదర్శనతో పాటుగా, చార్టుల ద్వారా వాటి ఆవశ్యకతను రైతులకు వివరించారు. పార్థీనియం కలుపు మొక్క ద్వారా కలిగే నష్టాలను వారికి తెలియజేశారు. ఆయా గ్రామాలలో సర్పంచులు పండుగ తిరుపతి, స్వయం ప్రభ, గ్రామ రైతు బంధు కోఆర్డినేటర్ పిట్టల అంజయ్య, ఎల్లాల దశరథ రెడ్డి, సిరిసిల్ల వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ఉమామహేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రియదర్శిని, డాట్ సెంటర్ కరీంనగర్ కోఆర్డినేటర్ డా,, మదన్మోహన్, వ్యవసాయ విస్తరణ అధికారులు సందీప్, రాజు, విద్యార్థులు జాహ్నవి, జెరుష పెర్సిస్, లిఖిత, పవిత్ర, రైతులు పాల్గొన్నారు.