వ్యవసాయ విస్తరణ సంస్కరణలపై దేశీ డీలర్లకు అవగాహన
డీలర్లకు విస్తరణ సేవలపై అవగాహన కల్పిస్తున్న కెవికె సీనియర్ శాస్త్రవేత్త లవకుమార్
గరిడేపల్లి, సెప్టెంబర్ 25 (జనం సాక్షి): దేశీ కోర్స్ చేస్తున్న వ్యవసాయ ఉపకరణాల డీలర్లకు వ్యవసాయ విస్తరణ సంస్కరణలపై అవగాహన తప్పనిసరి అని కెవికె గడ్డిపల్లి ఇంచార్జీ సీనియర్ శాస్త్రవేత్త అధిపతి బి. లవకుమార్ అన్నారు. ఆదివారం కెవికె గడ్డిపల్లి లో దేశి కోర్సు చేస్తున్న ఉపకరణాల డీలర్లకు భారతీయ వ్యవసాయ విస్తరణ సంస్కరణలో భాగంగా రూపొందించిన పలు ప్రాజెక్ట్ లు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. భారతీయ వ్యవసాయ స్థితి గతులను వివరించి హరిత విప్లవం శ్వేత విప్లవం నీలి విప్లవం లతో పాటు పలు వ్యవసాయ అనుబంధ రంగాలలో సాధించిన ప్రగతి చేపట్టిన వివిధ ప్రాజెక్టు లైన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి రాష్ట్ర వ్యవసాయ విశ్విద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు లాబ్ టు లాండ్ ప్రోగ్రామ్ లతో పాటు మేనేజ్ సమేతి ఆత్మ ప్రాజెక్ట్ ఏర్పాటు వలన సాధించిన ప్రగతి తదితర అంశాల గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణలో దేశీ డీలర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వారికి సరైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా రైతాంగానికి వ్యవసాయ అనుబంధ రంగానికి లబ్ది చేకురుతుందని అన్నారు. తదుపరి మార్కెట్ లెడ్ ఎక్స్టెన్షన్ సైబర్ ఎక్స్టెన్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేశి కోర్స్ ఫెసిలిటేటర్ శంకర్ రావు తో పాటు ఉప కరణాల డీలర్లు బయ్యా నాగరాజు జూలకంటి నాగేందర్ రెడ్డి, ఎస్ కె జానిమియ , మాడుగుల రాజశేఖర్, పుసపల్లీ యాదగిరి, వీరవెల్లి కోటేశ్వరావు రావు, చీదళ్ళ నరసింహ రావు, సంద్యాల బక్కయ్య, కందిబండ వెంకన్న, యాదగిరి, రవీందర్ రెడ్డి, సైదులు, కొమరయ్య, వెంకటేశ్వర్లు, నాగేందర్, లింగయ్య తో పాటు 36 మంది పాల్గొన్నారు.
Attachments area