వ్యాట్‌ను రద్దుచేయాలని కలెక్టరును కలిసిన వ్యాపారులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలంటూ వస్త్ర వ్యాపారులు సోమవారం కలెక్టరు దినకర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినతిపత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా చేస్తానని వ్యాపారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వస్త్రవ్యాపారులు నర్సింహులు, దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు.