వ్యాధిగ్రస్తులను పట్టించుకోని ప్రభుత్వం.

అతిసార వ్యాధితో  ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే.
జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమర్.
తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లోని జూంటుపల్లి గ్రామంలో అతిసార వ్యాధితో  మహిళా సోమవారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, అదే గ్రామంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ని సందర్శించారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి గ్రామంలో ప్రజలు అతిసార వ్యాధితో బాధపడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు ప్రజల  ప్రాణాలు పోతుంటే పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం అన్నారు. గ్రామంలో సుమారు వందకు పైగా వ్యాధి గ్రాస్తులు ఉండగా వారిని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకిత జ్ఞానం లేదని అన్నారు.మంచి నీరు కలుషితం వల్లేవ్యాధి సోకడం జరుగుతుంది.కాబట్టి  స్థానిక అధికారులు సమస్యను వెంటనే పరిస్కరించకపోతే. బిజెపి పార్టీ తరఫున  క్యాంపుకార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామనిఅన్నారు. అదేవిదంగా అతిసారా వ్యాధి తో గత రెండు రోజుల క్రితం చనిపోయినవ్యక్తి కుటుంబానికి10లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి అని డిమాండ్ చేశారు. వెంటనే గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, మండల అధ్యక్షులు మహిపాల్,బంటరం భద్రశ్వర్, రామ నాయక్ ,నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.