వ్యాపార దృక్కోణంలో దేశాభివృద్ధి

5

మోదీ విదేశీ పర్యటనలో ఇదే సూక్తి

బహుళజాతి కంపెనీల ముందు బొక్క బోర్లా

స్వదేశీ విధానానికి స్వస్తి

విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మోదీ వ్యతిరేకత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18(జనంసాక్షి) : ఛాయ్‌వాలా కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధాని పదవి చేపట్టిన మోదీ వ్యాపార దృక్కోణంలో దేశాభివృద్ది సాధ్యమవుతుందని అభిఫ్రాతపడుతున్నారు. ఇటీవల జర్మనీ, ఫ్రాన్స్‌, కెనడా దేశాల్లో పర్యటించిన మోదీ వ్యవహారశైలి చూస్తే బహుళజాతి కంపెనీలకు మోకరిల్లుతున్న వ్యవహారశైలి స్పష్టంగా కనిపిస్తున్నది. రక్షణల రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించడం మొదలు ఎన్నో సాంప్రదాయ విధానాలకు మోదీ స్వస్తి పలుకుతున్నారు. అభివృద్ధి పేరుతో విదేశీ కంపెనీలకు, కార్పొరేట్‌లకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ ఫక్తు వ్యాపారస్థుడిలా వ్యవహరిస్తున్నారు. 70 శాతం వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో భూసేకరణ చట్టాన్ని పెద్దయెత్తున దేశవ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తున్నా పట్టువీడటంలేదు. రైతుల ఆత్మహత్యలు అంతకంతా పెరిగిపోతున్నా కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప ప్రచారం ఎక్కువ ఆచరణ శూన్యం అన్నరీతిన మోదీ సర్కారు వ్యవహారం సాగుతోంది. అదానీ అంబానీల కోసమే అన్నట్లుగా నేను గుజరాత్‌లో పుట్టిన వ్యాపారవేత్త లక్షణాలు నా జీన్స్‌లోనే ఉన్నయని బాహాటంగానే ప్రధాని చెప్పుుకుంటున్నరు.

ఇంటగెల్చి రచ్చగెలవాలన్నది నానుడి. అయితే మోదీ ఇంట గెలవడమంటే ఎన్నికల్లో గెలవడం అనుకున్నారు. ప్రచారార్భాటంతో ఎన్నికల్లో ఓట్లు గెలుచుకున్న మోదీ ప్రజల మనసులు మాత్రం గెల్చుకోలేలేకపోతున్నారు. ఈ దేశ ప్రజలు మోడీని భిన్నంగా చూశారు. భిన్నంగా ఆలోచించారు. మోడీ ప్రధాని అయితే దేశ గతి మారుతుందని అనుకున్నారు. కానీ ఏడాది అయినా అలాంటి వాసనలు కానరావడం లేదు. ప్రజల్లో నిరాశా నిస్పృహలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. మోడీకి ఓటేసిన వారు సైతం ఇప్పుడు అయ్యో అన్న నిట్టూర్పులో పడిపోయారు. అభివృద్దికి పునాది పడకపోవడం, ప్రజల సమస్యలపై పోరాటానికి బీజం పడకపోవడం వల్లనే ఇలా జరగుతోందనక తప్పదు. పాలకులకు కిందిస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉండాలి. వాటి బాధ తెలిసి ఉండాలి. అప్పుడే పాలన మెరుగ్గా ప్రజలకు చేరువగా ఉంటుంది. కానీ మోడీ అలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. ఆయన  సిఎంగా ఉన్న సమయంలో గత పదేళ్లలో విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ రాలేదు. అందుకే కసిగా విదేశాలుచుట్టి వస్తున్నారన్న విమర్శలు నిజమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని అంటే ప్రజల్లోకి వెళ్లగలగాలి. తీసుకున్న నిర్ణయాలు అమలవుతున్నాయా లేదా అన్న దృష్టి పెట్టాలి. పాలనంటే ప్రజలకు మెరుగైన జీవితం అందించేలా ఉండాలి. తీసుకున్న నిర్ణయాలు ప్రజల హితం కోరి ఉండాలి.

విదేశాలు పర్యటిస్తూ వ్యాపారవేత్తలను ఆహ్వానించడం మంచిదే అయినా దేశీయంగా మేకిన్‌ ఇండియా నినాదంతో ముందుకు వెళుతున్న ప్రధానికి మనదేశంలో ఉత్పత్తులను ప్రపంచానికి అమ్మగలిగేలా చేయలేకపోతున్నారు. పూర్తిగా గాంధీ సిద్దాంతాలకు విరుద్దంగా ఆయన పాలన సాగుతోంది. మనదేశంలో నైపుణ్యాలు ఉన్నాయి. ఉత్పత్తులు ఉన్నాయి. పారిశ్రామయికవేఉత్తలు ఉన్నారు. కానీ వారిని కాదని ఇంకా ఏదో సాధించి, ఇంకా భారత్‌ను పారిశ్రావిూకరణ చేయడం ద్వారా కాలుష్యాన్ని కొనుక్కోవడం తప్ప మరోటి కాదు. వ్యవసాయకంగా బలంగా ఉన్న భారత్‌ను ఆహారధాన్యాల భాండాగారంగా నిలపాలి. నీటికోసం వెతలు ప డే స్థాయి రాకుండా చేయాలి. సేంద్రియ ఎరువుల ద్వారానే వ్యవసాయం సాగేలా చేయాలి. ఈ పనులు చేసి ఎగుమతులు పెంచుకుంటే మనం ఎంతగానో రాణిస్తాం. విదేశీ మారకాన్ని ఆర్జిస్తాం. కానీ అలాంటి ప్రయత్నాలు జరక్కపోవడం వల్ల మనం ముందుకు కదలడం లేదు. విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీయులను వెళ్లగొట్టాలన్న గాంధీ ఆలోచనలకు భిన్నంగా గాంధీ పేరుచెప్పుకుంటున్న మోడీ పాలన సాగడమే ప్రజలకు జీర్ణించుకోలేనిదిగా ఉందనడంలో సందేహం లేదు.  మియన్మార్‌, ఆస్టేయ్రా, ఫిజిలు ఒకసారి; సీషెల్స్‌, మారిషస్‌, శ్రీలంక మరొకసారి; తాజాగా ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాలకు ప్రధాని మోదీ దీర్ఘకాల పర్యటనలపై విపక్షం విరుచుకుపడుతున్నా వెనక్కి చూడకుండా వెళ్లి వచ్చారు. విదేశాంగ విధానంలో కొత్త ఊపు ఉత్సాహాల్ని తీసుకుని రావడానికి విదేవాంగ మంత్రిని తరచూ వెళ్లేలా చేయాలి. కానీ పాపం సుష్మాస్వరాజ్‌కు  ఆ పని లేకుండా మోడీ చేస్తున్నారు. అన్ని దేశాలు ప్రధానే చుట్టి వస్తే విదేశాంగ మంత్రిగా సుష్మా ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి.  ద్వైపాక్షిక పెట్టుబడులకు, వాణిజ్యాభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి మేలుబాటలు వేయాలన్నదే తన పర్యటన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించినా అందుకు తానే వెళ్లాల్సిన అవసరం ఉందా అన్నదే చర్చ.

దేశం సమస్యలతో కొట్టుమిట్లాడుతోంది. రాష్టాల్ల్రో అనేకానేక సమస్యలు ఉన్నాయి. సరిహద్దుల్లో వివాదాలు, టెర్రరిస్టుల దాడుల బెదరింపులు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలి. తాము మాట్లాడిన వాటికి అనుగుణంగా పాలన సాగుతుందా అన్నది చూడాలి. అయితే  విదేశీగడ్డవిూద యూపిఎ పాలనను విమర్శించడం వల్ల ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ఆయన విమర్శించారనుకుంటే పొరపాటు. అది మనలని మనం తక్కువ చేసుకున్నామన్న భావన గుర్తించాలి. ఎన్నికలకు ముందు దేశం పరువు ప్రతిష్ఠల గురించి తీవ్రంగా చింతించిన నరేంద్రమోదీ ఇప్పుడు స్వలాభం కోసం పూర్వపు పాలనను వెటకారం చేస్తే పోయేది భారత్‌ పరువేనన్న అంశాన్ని గుర్తించకపోవడం బాధాకరం. బొగ్గుగనులను చేతిరుమాళ్ళు ఇచ్చినట్టుగా ఇచ్చేశారంటూ పారిస్‌లోనూ, గత పాలకులు చెత్తచెత్త చేసిపెడితే తాము చక్కగా శుభ్రం చేస్తున్నామంటూ కెనడాలోనూ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రమూ ప్రధాని ¬దాకు తగ్గట్టుగా లేవు.దౌత్యాన్నీ, వాణిజ్యాన్నీ సమపాళ్ళలో నెరపడానికి నరేంద్రమోదీ చేస్తున్న వరుస పర్యటనల మాదిరిగానే ఈ యూరప్‌ యాత్రకు కూడా ప్రాధాన్యం ఉందని బిజెపి విశ్లేషిస్తున్నా, ఇదొక్కటే పాలన అనుకుంటే పొరపాటు. దేశంలో నిత్యావసరాల ధరలు తగ్గించడంలో గానీ, వ్యవసాయోత్పత్తుల పెంచడం, గ్రావిూణ రోడ్ల దశను మార్చడం, పేదలకు ఆహారభద్రత కల్పించడం, మెరుగైన రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను, ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సమయం కేటాయించడం లేదు. ఇలా విదేవాలు చుట్టి వచ్చి కనీసం అక్కడ ఉన్న విధంగా అయినా మౌళిక సదుపాయాలపైన అయినా దృష్టి పెడితేనే దేశం బాగుపడుతుంది. విదేశాల్లో ఉన్నట్లుగా కనీస సౌకర్యాలపై చర్యలు తీసుకున్నా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.