శంభునిపేట సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం
వరంగల్ ఈస్ట్, జూలై 21 (జనం సాక్షి)మణిపూర్ లో జరిగిన మహిళల నగ్న ప్రదర్శనతో పాటు అత్యాచారం హత్య నిరసిస్తూ వరంగల్ నగరంలోని ఖమ్మం ప్రధాన రహదారి శంభునిపేట సెంటర్లో సిటీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి ఆధ్వర్యంలో కొండ సురేఖ మురళి దంపతుల ఆదేశానుసారం శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి పి సి సి నేత నల్గొండ రమేష్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటన అత్యంత హేయమైన చర్య అని అన్నారు. దేశంలో మహిళలకు భద్రత లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మహిళలు అన్ని వర్గాల ప్రజలకు రక్షణ తో పటు దేశం అభివృద్ధిలోకి వస్తుందని రమేష్ పేర్కొన్నారు. సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళి మాట్లాడుతూ ఎన్డీఏ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ద్వారా దేశంలో మహిళలకు రక్షణ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్గొండ రమేష్, ఇటికాల అశోక్, నారగోని మురళి, ఎండి లతీఫ్, బషీర్, బత్తుల కుమార్, సింగరి రాజ్ కుమార్, మడిపల్లి కృష్ణ, చిప్ప వెంకటేశ్వర్లు, రేణిగుంట్ల శివ, దాసరి రాజేష్, సాజిద్, మురళి, రజిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.