శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఇవాళ వారు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ. అక్షలు విలువ చేసే గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.