శంషాబాద్ విమానాశ్రయంలో 4కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్,ఫిబ్రవరి17జనంసాక్షి : శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. ఇటీవల వరుసగా బంగారం పట్టుబడుతున్నా దిగుమతి మాత్రం ఆగడం లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. తాజాగా విమానాశ్రయంలో 4 కిలోల బంగారన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి బిస్కట్ల రూపంలో ఉన్న నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.