శతకాన్ని పూర్తి చేసిన మురళీ విజయ్
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు. 206 బంతుల్లో 12 బౌండరీలు, రెండు సిక్సర్లతో శతకాన్ని పైర్తి చేశాడు. ఈ సిరీస్‌లో విజయ్‌కిది రెండో శతకం కాగా.. టెస్టుల్లో అతనికిది మూడో సెంచరీ. వికెట్లేమి కోల్పోకుండా 283 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీంఇండియా రెండు వికెట్ల నష్టానికి 304 పరుగులతో ఆడుతోంది.