శనగ రైతులను ఆదుకోలేక పోయిన సర్కార్‌: వైకాపా

ఒంగోలు,మే30(జ‌నం సాక్షి):  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లాకు చేసింది శూన్యమని వైకాపా మండిపడ్డింది.  రైతులు పండించిన శనగలు సైతం కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పరుచూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త రావి రామనాధం విమర్శించారు. పరుచూరులో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ద్వారా నామమాత్రంగా క్వింటాలు రూ.4400లు చొప్పున కొనుగోలు చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ధరకు తోడుగా క్వింటాలుకు రూ.2 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. టిడిపి ప్రభుత్వం హావిూలతో కాలయాపన చేయకుండా ఇచ్చిన హావిూలను అమలు చేయాలని కోరారు. వైసిపి అధినేత జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నామని వివరించారు.