శని, ఆదివారాలు కూడా బ్యాంకులు

th04_bu_bank_2644154fప్రజలకు ముఖ్యంగా, బ్యాంకు ఖాతాదారులకు వూరటనిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ, గురువారాలు బ్యాంకులు, ఏటీఏం సేవలు వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. దీంతో వచ్చే శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయని ఆర్‌బీఐ వెల్లడించింది. నోట్ల రద్దు కారణంగా నగదు కొరతతో సతమతవుతున్న సగటుజీవికి ఇది వూరట కలిగించే విషయమే.