శని విరుగుడయ్యింది
– శరవేగంతో దూసుకుపోతాం
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,జులై 20(జనంసాక్షి):పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు.సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల విూద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.