శరవేగంగా మిషన్ భగీరథ పనులు
మెదక్,మే21(జనం సాక్షి): జిల్లాలోని వివిధధ గ్రామాల్లో మిషన్‌భగీరథ పైపులైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయాబ్యాంక్ అధికరాఉల బృందం సిద్దిపేట వద్ద పనులను పరిశీలించింది. గ్రామాలకు శుద్ధ జలాలను పైపులైన్ల ద్వారా సరఫరా చేసేందుకు పైపులైన్లు, రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తిచేయడమే కాకుండా ప్రతి గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు యంత్రాల సహాయంతో కాల్వల తవ్వకం, పైపులను జాయింటింగ్ చేయడం పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి నీటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నది. ఈ మేరకు గ్రామాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి.