శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

ఆసక్తిగా పనులను పరిశీలిస్తున్న భక్తులు

యాదగిరిగుట్ట,నవంబర్‌8(జ‌నంసాక్షి): యాదాద్రికి వస్తున్న భక్తులు ఇక్కడ జరుగుతున్న పపునర్నిర్మాణ పనులను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజూ వస్తున్న వేలాదిమంది భక్తులు యాడా చేపట్టిన విస్తరణపనులను తిలకించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. చురుకుగా జరుగుతన్న పనుల తీరును చూసి ఆశ్యర్య పోతున్నారు.. 2.33 ఎకరాల విస్తీర్ణంలో పూర్తి రాతి కట్టడాలతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించే ప్రణాళికలతో నడుం బిగించింది. ఆ మేరకు సాంకేతిక, రహదారులు, నిపుణుల కమిటీలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ పనుల వేగిరానికి యత్నిస్తోంది. ఉద్యమంతో తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి ¬దాలో ఈ క్షేత్రాన్ని సందర్శించి మహాదివ్యక్షేత్రంగా అభివృద్ధిపరచాలని స్వయాన ఆయనే మూడేళ్ల వెల్లడించిన విషయం విదితమే. యాదాద్రి క్షేత్రాన్ని అంతర్జాతీయ ఆధ్యాతిక కేంద్రంగా మార్చే లక్ష్యంతో నాటి నుంచి పక్కా ప్రణాళికల రూపకల్పనకు కసరత్తు చేశారు. క్షేత్రాభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పరిచారు. జరుగుతున్న నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలు తమ దృష్టికి తేవాలని కిషన్‌రావు సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని యాడా ఛైర్మన్‌ జి. కిషన్‌ రావు వెల్లడించారు. ప్రఖ్యాతిగాంచే రీతిలో ఆలయ పునర్‌నిర్మాణం జరగాలన్న యోచనతో ప్రముఖ శిల్పులు, స్తపతుల నమూనాలను సిద్ధపర్చారు. ఇకపోతే ఇక్కడ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కిషన్‌ రావు స్వీయ పర్యవేక్షణలో ఎవరికి అప్పగించిన పనుల్లో వారు నిమగ్నమయ్యారు. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి సలహా, సూచనలతో రూపుదాల్చిన నమూనాలతోనే స్తంభోద్భవుడి సన్నిధి నిర్మాణం కానుంది. సుమారు రూ.800 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమయ్యే శ్రీ స్వామి ప్రాంగణంలో భక్తులకు ఆధ్యాత్మికతను అందిస్తూ, వృద్ధులు ప్రయాసలకు లోను కాకుండా ప్రాకారాలు ఏర్పాటు కానున్నాయి. శిల్పి పనుల పర్యవేక్షణకు స్తపతి

సలహాదారులు నిరంతరం దృష్టి పెట్టాలంటూ యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావు ఆదేశించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ విస్తరణతో కూడిన పునర్‌ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని పనులు పొందిన గుత్తేదారు సంస్థలకు యాడా నిర్దేశించిందన్నారు.పనులను పర్యవేక్షిస్తూ జాప్యం జరిగితే జరిమానా లు కూడా తప్పవని స్పష్టంచేసినట్లు సమాచారం. అద్భుత శిల్పకళా రూపాలతో రూపొందనున్న యాదాద్రి లోనే ఆ పనులు చేపట్టాలని ప్రాధికార సంస్థ సూచిస్తూ తగు స్థలాన్ని కేటాయించింది. వివిధ రూపాలతో కూడిన శిల్ప కళ పనులను స్థానికంగానే నిర్వహిస్తూ ఆలయ విస్తరణకు తోడ్పడాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాలలో మొదలైన శిలాల్ప చెక్కడాల శిబిరాలను ఇక్కడికే తరలించి శిల్పాలను రూపొందించా త్వరగా రాజగోపురాల నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనులను వేగింపెరుస్తూ ‘యాడా’ ప్రత్యేక దృష్టిని సారించింది. మహారాజసంతో భక్తులకు తన దర్పాన్ని చాటే తీరులో ఆలయ పునర్‌నిర్మాణంలో రూపొందించే శిల్పాల తయారీని ఇక్కడే చేపట్టనున్నారు. మహాదివ్యంగా విమానగోపురం భక్తులను అలరించనుంది.ఆలయ విస్తరణలో ప్రస్తుతం జరుగుతున్న రక్షణగోడ నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరున పూర్తవుతుంది. ఆలయ సన్నిధిలో సత్రభవనాలు, కాటేజీలు నిర్మించిన పాత దాతలను పరిగణనలోకి తీసుకుని ఆదరిస్తామని కిషన్‌రావు స్పష్టం చేశారు.. గతంలోని దాతల భవనాల విలువ ప్రకారం నూతనంగా నిర్మించే సముదాయాలలో గదులను దాతల పేరిట కేటాయిస్తామని ఆయన వివరించారు. పెద్దగుట్టపై 258 ఎకరాల్లో అధునాతన వసతులతో కాటేజీలు, ఉద్యానవనాలతో టెంపుల్‌సిటీ నిర్మితమవుతోంది. దూరప్రాంతాల నుంచే కాకుండా పరిసరాలలోని యాత్రికులు, పారిశ్రామికులు క్షేత్ర సందర్శనకు వచ్చే దశలో కాటేజీలను కేటాయించేందుకు టెంపుల్‌సిటీ నిర్మితమవుతోంది.