శాంతినగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 18 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జిల్లా బి జె పి ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ఎస్.రామచంద్ర రెడ్డి పాల్గొనీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి తెలంగాణ పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీరుడు 360 ఏళ్ళ క్రితం తెలంగాణ గడ్డపై మొఘల్ నిరంకుశ పరిపాలనను ఎదురించి పీడిత ప్రజలను ఏకం చేసి బహుజన రాజ్యం నిర్మించి తెలంగాణ ప్రాంత అస్తిత్వం లో తిరుగుబాటు ఉందని నిరూపించిన ఉద్యమకారుడనీ,
తన యుద్ద నైపుణ్యంతో శివాజీ మహారాజ్ వలే మొగులాయలను తరిమి కొట్టి గొల్ల కొండను స్వాధీనం చేసుకుని కులవృత్తులను ఏకం చేసి బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించి న్యాయమైన పరిపాలనను అందించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
ఇన్ని ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప వీరుల చరిత్రను మరుగున పడేవేన విదేశీ కుటుంబ రాజకీయ పార్టీలు ఇకనైనా వీరి లాంటి వీరుల చరిత్రను గుర్తించి వెలికి తీసి పాఠ్య పుస్తకంలో చేర్చాలి అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండలాధ్యక్షుడు నరసింహు లు,పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు,నాగమద్దిలేటి, బిజెపి సీనియర్ నాయకులు వర ప్రసాద్ రావు,ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్,ఈశ్వరయ్య,ఐజ బి జె వై ఎం మండల అధ్యక్షులు అంజి, రవి కుమార్ యాదవ్, పవన్ కుమార్ రెడ్డి,బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.