శాంతిభద్రతల పరిరక్షణలో సక్సెస్ : ఎస్పీ డాక్టర్ రవీందర్
ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి
కరీంనగర్, జూన్ 5: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో శాంతిభద్రత ల పరిరక్షణలో జిల్లా పోలీస్‌శాఖ సఫలీకృ తమైందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఈనెల 6వ తేదీ నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన జిల్లాలో శాంతిభద్రల పరిరక్షణకు చేపట్టిన వివిధ చర్యలు, కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివిధ రకాల నేరాల నియంత్రణ, శాంతియుత వాతావరణానికి భం గం కలిగే ప్రమాదాలు వచ్చిన సందర్భాల్లో ప్రజ ల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతోపాటు పలు అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రజలను భాగస్వాములను చేయ డం కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్ర మాలను విశేష స్పందన లభించిందని ఎస్పీ పేర్కొన్నారు. యువతను సన్మార్గంలో పయనిం పజేసి వారి భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. శాం తి భద్రత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భా గంగా గ్రామానికో పోలీస్ పథకం ప్రవేశపెటా ్టమన్నారు. సమర్థవం తంగా సేవలందించిన పోలీ సులకు రివార్డులు అందజేశామని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న దోపిడీ, దొంగతనాలు, హత్యకేసులతో పాటు వివిధ రకాల నేరాలను ఛేదించడంలో సమర్థవం తమైన సేవలందిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందిని అభినందిస్తూ ప్రతినెలా రివార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా నేరసమీక్షా సమా వేశం సందర్భంగా సమావేశానికి హాజరయ్యే అధికారులందరి సమక్షంలో రివార్డులు, అవార్డు లు, జ్ఞాపికలను అందజేస్తున్నామని ఎస్పీ వివరిం చారు. పోలీస్ సబ్-కంట్రోళ్ళతో పోకిరీలకు చెక్ పెట్టేందుకు విజబుల్ పోలీస్ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళలు విద్యార్థినులను వేధిం చడంతో పాటు మత్తు పానీయాలు సేవించి ప్రజ లను ఇబ్బందులకు గురిచేసే పోకిరీలకు చెక్ పెట్టడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం విజబుల్ పోలీస్ విధానంలో భాగంగా జిల్లాలో నూతనంగా పోలీస్ సబ్-కంట్రోల్‌రూంల ఏర్పాటుకు శ్రీకారం చుట్టా మని తెలిపారు. పోలీసుల సంక్షేమం, సిబ్బందికి హెల్త్ చెకప్ కోసం జిల్లా పోలీసుల సంక్షేమ కోసం పలు కార్యక్రమాలను నిర్వహించామని, ఇందులో ప్రధానంగా జిల్లాలో వివిధ స్థాయిల్లో పనిచేస్తూ 40 సంవత్సరాలు వయస్సు పైబడిన వారికి మాస్టర్ హెల్త్ చెకప్ కింద సంపూర్ణ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కరం కోసం ఎస్. ఎం. ఎస్ గ్రీవెన్సెస్ సెల్ ప్రారంభం
జిల్లాలోని పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కరం కోసం జిల్లా కేంద్రంలో ఎస్.ఎం.ఎస్ గ్రీవెన్సెస్ సెల్ ప్రారంభిం చామని ఎస్పీ తెలిపారు. జీతభత్యాలు. ఇంక్రిమెంట్లు, శాఖాపరంగా అందాల్సిన ఇతర అలవెన్సులు. జీపీఎఫ్, హెచ్.ఆర్.ఏ. టి.ఏ లాంటి విషయంలో ఎలాంటి ఆలస్యం జరుగకుండా ఉండటమే కాకుండా సిబ్బంది సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈ ఎస్.ఎం. ఎస్ గ్రీవెన్సెను ప్రారంభించినట్టు ఎస్పీ వివరించారు.సామాజిక చైతన్యం కోసం ఎన్నో విజయవంతమైన ఉద్యమాలకు ఊపిరులూదిన కరీంనగర్ జిల్లా పల్లెప్రజలు పోలీసుల సహకారంతో నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న దోపిడీ దొంగలను ఎదురిం చేందుకు స్వచ్ఛందంగా నడుంకట్టి గ్రామ రక్షణ దళాలుగా ముందుకు వస్తున్నారని తెలిపారు. గ్రామ రక్షణ దళాల పహారా కోసం దుప్పట్లు, కర్రలు, టార్చిలైట్లు,విజిళ్లను పోలీసు శాఖ తరఫున అందజేస్తున్నామన్నారు. వివిధ రకాల కుటుంబ కలహాలతో సతమతమ య్యే వారి కాపురాలను సరిదిద్ది వారి కాపురాలను చక్కదిద్దేందుకు ప్రతి పోలీసు సర్కిల్ కేంద్రంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా రు. కౌన్సెలింగ్ చేసే కమిటీలో ఒక సైక్రియాటిస్ట్, న్యాయవాది, ఎన్జీవో, స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి, వైద్యుడు ఉంటారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యుర్థులకు
ఉచిత శిక్షణ శిబిరాలు
పోలీసుశాఖలో ఎస్‌ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువకులకు ప్రోత్సాహమిందించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని, రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు.పడ్బందీ చర్యల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు.గల్ఫ్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని,ముఖ్యంగా ఈ విషయంలో నిరుద్యోగ యువతీయువకులను చైతన్యవంతు లను చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామ న్నారు. ప్రజల సమస్యలపై సత్వరం స్పందించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సోమవా రం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్పీ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో వివిధ తీవ్రాద సంస్థల్లో పనిచేసి లొంగిపోయిన తీవ్రవాదులకు పునరా వాస చర్యలు కల్పిస్తున్నామన్నారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పించేందుకు కౌన్సె లింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికిసేందుకు మారుమూల గ్రామాల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తు న్నామన్నారు. అంతేకా కుండా పోలీసుల్లో వృత్తి నైపున్యం పెంపొందిం చేందుకు కాప్సల్స్ కోర్సులు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులకు బేసిక్ కం ప్యూటర్ శిక్షణ కరీంనగర్ జిల్లాలోని పోలిసులకు ప్రాధమిక కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీ.సీ.టీ.ఎస్.ఎస్) ద్వారా శిక్షణ కార్యక్రమం కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని స్థాయిల అధికా రులకు బేసిక్ కంప్యూటర్స్‌పై శిక్షణ ఇప్పటి వరకు జిల్లాలో 1082 మంది పోలీసులు శిక్షణ పొందారని,వారానికి ఒక్కో బ్యాచ్ చొప్పున శిక్షణ కర్యాక్రమాలను నిర్వహించడం జరుగుతోందని, మారుతున్న కాలానికను గుణంగా వస్తున్న వివిధ రకాల నూతన అప్లికేషన్లపై కూడా శిక్షణ కార్యక్ర మాలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీ.టీ.సీ)పోలీసు శిక్షణ కళాశాల (పీ.టీ.సీ)లో శిక్షణపొందుతున్న కానిస్టే బుల్‌కు సైతం సిలబస్‌లో భాగంగా కంప్యూటర్ విద్యను చేర్చి బోధించడం జరుగుతోందని, పోలీసులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని ఎస్పీ వివరించారు.