శాంతిభద్రత పరిరక్షణపై ఆడిషనల్‌ డీజీపీ సమీక్ష

నల్గొండ: జిల్లాల సరిహద్దుల్లో జరుగుతున్న నేరాలనే అదుపు చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సమస్వయంతో పనిచేయాలని అడిషనల్‌ డీజీపీ వి,కె. సింగ్‌ సూచించారు. మంగళవారం నల్గోండ ఎస్టీ కార్యాలయంలో హైదరాబాద్‌ రేంజ్‌ పరిధిలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో  శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో కేసుల నమోదును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరీశీలించారు. ఆయా జిల్లాల్లో కేసుల నమోదును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలించారు. అనంతరం పోలీసు హెడ్‌క్వార్టర్‌లో క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ రేంజ్‌ డీఐజీ నాగిరెడ్డి, ఆయా జిల్లాల ఎస్పీలు డాక్టర్‌ నవీన్‌ గులాఠి, నాగేంద్రకుమార్‌, రాజకుమారి ,ట్రైనీ ఐపీఎస్‌ అధికారి విజయరావు, నల్గొండ అడిషనల్‌ ఎస్పీ సిద్ధయ్య తదితరులు పాల్గోన్నారు.