శాంతియుతంగా ఆందోళన చేపట్టాలి: కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు వద్దకు వచ్చి, అక్కడ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగడం దారుణమన్నారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు ఎక్కడికక్కడే ధర్నాలు చేయాలని సూచించారు. శాంతియుతంగానే ఆందోళన చేపట్టాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. 6వేల పైబడి బైండోవర్‌ కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని కోదండరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను కావాలనే ప్రభుత్వం సృష్టించి భయాందోళనకు గురిచేస్తోందని ఆయన అరోపించారు. పోలీసుల నియంతృత్వాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.