శాంతి కమిటీలతో గణెళిశ్‌ మంటపాలపై చర్చ

ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గణెళిశ్‌ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని అన్నారు. ఎవరు దీనికి బాధ్యులో తెలియచేయాలన్నారు. ఈ గణెళిశ్‌ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా సామరస్యంగా నిర్వహించేందుకు ఎస్పీ విష్ణు వారియర్‌ అన్ని వర్గాల ప్రజలతో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయిస్తూ పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. మసీదులు, మందిరాల వద్ద పికెటింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాలపై ఇప్పటికే జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దు గుండా పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు, ఎన్నికల ప్రచారం ఒకేసారి రావడం ఇంటిలీజెన్సీ నిఘా వర్గాల సూచనల మేరకు అసాంఘిక శక్తులు పట్టణంలో ప్రవేశించకుండా పోలీసుశాఖ ముందస్తు చర్యలను చేపట్టింది. మావల, చాందా, రాంపూర్‌, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌, హస్నాపూర్‌, సుంకిడి రహదారుల గుండా ఈ చెక్‌ పోస్టులను ఏర్పాటు చే సేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ రహదారుల గుండా వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ కోసం ప్రత్యేక టీంలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తులో జీపీఎస్‌ సిస్టం ఉన్న కెమెరాలను వినియోగించనున్నారు. ఈ కెమెరాలకు ఎస్పీ కంట్రోల్‌ రూం తో పాటు హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూం కు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బందోబస్తుకు సంబంధించిన వివరాలను కంట్రోల్‌రూంలో అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇంటలీజెన్సీ నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసు యంత్రాంగం ఈ ఉత్సవాలపై నిఘా పెట్టనుంది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను

ఏర్పాటు చేసి ఎస్పీ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేయనున్నారు. ఆ ప్రాంతాల వద్ద ఎప్పటికప్పుడు జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకోడానికి ప్రత్యేక సిబ్బందిని సైతం నియమించనున్నారు.