శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

వేమనపల్లి,సెప్టెంబర్ 22 (జనంసాక్షి)

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కాళేశ్వరం జోన్ వేమనపల్లి మండలంలోని కాటేపల్లి గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మంచిర్యాల ఇన్చార్జి డిసీపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చెన్నూరు రూలర్ సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో నీల్వాయి పోలీసు సిబ్బందితో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు.ఈ సందర్భంగా సీఐ విద్యసాగర్ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి , ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కాలు,గుడుంబా తయారీ,గంజాయిని విక్రహిచడం, పీడీస్ రైస్ అక్రమ రవాణా,కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారి ఆన్లైన్లో రమ్మీ పబ్జి లాంటి గేములు ఆడుతూ చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు.ఇప్పుడు పడినటువంటి ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని,చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని,డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని,చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు.వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్,ఇన్సూరెన్స్,పొల్యూషన్ కలిగి ఉండాలని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదని,ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రినివల్ చేయించుకోవాలని సూచించారు.మహిళల భద్రతే పోలీసుల లక్ష్యమని, యువతులు,చిన్నపిల్లలతో మర్యాదగా ప్రవర్తించి వారిని గౌరవించాలని అన్నారు.మహిళలు,చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రజలు,మహిళలు ఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయ‌న్నారు.సోషల్ మీడియాలో వచ్చే పలు రకాల పుకార్లను నమ్మకూడదని,వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని,భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడితే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి,పిన్ నెంబర్ లను చెప్పకూడదని, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో చెన్నూరు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,నీల్వాయి ఎస్ఐ గోపతి నరేష్,టిఎస్ఎస్పీ పోలీస్ సిబంది పాల్గొన్నారు.