శాఖలవారిగా సీఎం చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. శాఖల వారిగా సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. టిటిడి పాలకమండలి నుంచి తుడా ఛైర్మన్ ను తొలగించాలని నిర్ణయించారు. పౌరసరఫరాల విభాగంలో ఈ-పాస్ విధానం గందరగోళంపై చర్చ జరుగుతోంది. ఈ-పాస్ విధానంలో చాలా సమస్యలను పరిష్కారం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ-పాస్ విధానంలో సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని మంత్రులకు సూచించారు.