శానిటేషన్ గ్రామ కమిటీ సమావేశం
గరిడేపల్లి, ఆగస్టు 3 (జనం సాక్షి): వెలిదండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ శానిటేషన్ కమిటీ మీటింగ్ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు .ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలని ఇంటి పరిసరాలలో ఉన్న చెత్త చెదారం తొలగించాలన్నారు. కూలర్స్ కొబ్బరి బోండాలు నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని పడబోయాలన్నారు . మురికినీటి ఆవాసాలు ఉన్నట్లయితే వాటిని మట్టితో పూడ్చి వేయాలని లేనిచో వాటిలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. నీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదూరి పద్మ ,సూపర్వైజర్ అంజయ్య గౌడ్, ఏఎన్ఎం సైదమ్మ , గ్రామ పెద్దలు ,అంగన్వాడి కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.