శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన
హైదరాబాద్ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి తెలంగాణపై తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు.