శాసనసభ నుంచి వెళ్లిపోయిన సీఎం, స్పీకర్
హైదరాబాద్ : అసెంబీ గేట్-1 వద్ద తెరాస ఎమ్మెల్యేలు, అసెంబ్లీ గేట్-2 వద్ద సీపీఐ, భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో మరో గేటు నుంచి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సభాపతి మనోహర్‌లు బయటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు రోడ్డుపై పడుకుని వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో భద్రతా, అధికారులు సీఎం, స్పీకర్‌ను మరో గేటు నుంచి బయటకు పంపారు.