శాస్త్రవేత్తలు గత 12 సంవత్సరాలుగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు జరుపుతున్నారు
కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు శాస్త్రవేత్తలు గత 12 సంవత్సరాలుగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు జరుపుతున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ,మగ దూడలు సమానంగా పొందే అవకాశం ఉన్నది కానీ పాడి రైతులకు మగదూడలతో పెద్దగా ఆదాయం రాదు కావున రైతులు ఆడ దూడలనే కోరుకుంటారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు వేరు చేసిన వీర్యాన్ని( sex sorted semen)వాడుతున్నారు.
ఈ పద్ధతిని 2001 నుండి అమెరికాలో వాడుతున్నారు ఈ వీర్యంతో సమయంతో పాటు రైతులు కోరుకున్న దూడను పొందవచ్చు .
ఆవులలో సాహివాల్ ఆంబోతు వీర్యాన్ని గత సంవత్సర ప్రధాన శాస్త్రవేత్త
డా.J. నరసింహ కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.యన్.రెడ్డి, మరియు డాక్టర్ బి. రవీందర్ పశు విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రాథమిక
పశువైద్య ఆరోగ్య కేంద్రాలైన,వేలేరు, భీమదేవరపల్లి, మాణిక్యపూర్, మరియు ఎల్కాతుర్తి పశు వైద్యశాల లలో BAIF సంస్థ నుండి తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా సరఫరా చేయడం జరిగినది. ఆ కేంద్రాలకు చెందిన పశువైద్యులు అక్కడి రైతులకు చెందిన ఆవులు ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్బ ధారణ చేయగా ఆవులు గర్భం దాల్చి, కొన్ని గత నెలలో మరికొన్ని ఈ నెలలో ఈనడం జరిగినది మరియు పుట్టిన దూడలు కూడా అన్ని ఆడ దూడలే.
ఈ ప్రక్రియలో
85 – 95% కోరుకున్న దూడలను పొందవచ్చు.
ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్త
డాక్టర్ రాజన్న గ్రామాలను సందర్శించి పశువైద్యులను అభినందించడం జరిగినది