శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందాలి:మంత్రి పొన్నాల

హైదరాబాద్‌, నవంబర్‌ 22:మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం హెచ్‌ఐసిసిలో జరిగిన ఇ .ఇండియా 2012 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నేడు రాష్ట్రం  ఐటి రంగంలో ఎంతో ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వీసేవా ద్వారా ప్రజలు  అనేక సౌకర్యాలను అనుకున్న సమయంలో పొందుతున్నారంటే దానికి ప్రధాన కారణం శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానమే నన్నారు. దీనిని యూనివర్సిటీలు  విద్యార్థులకు మరింత విశదీకరించి దేశ పురోభివృద్దికి దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఇ. ఇండియా 2012 అవార్డును ఎల్‌పి యూనివర్సిటీ చాన్సలర్‌ అశోక్‌ మిత్తల్‌కు  మంత్రి పొన్నాల చేతులవిూదుగా అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకయైన  ఇ. ఇండియా అవార్డు తమ యూనిర్వసిటీకి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డు ద్వారా ఈ. గవర్నెన్స్‌ అమలులో ఎల్‌. పి యూనిర్వసిటీ అగ్రగామిగా నిలిచిందన్నారు. నూతన సాంకేతిక పరిఙ్ఞానంలో పలు సేవలను సరళంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇ. ఫోన్‌ అండ్రాయిడ్‌ పోన్‌లకు అప్లికేషన్లు కూడా ఎల్‌. పి యూనిర్వసిటీ అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ జాజు తదితరులు పాల్గొన్నారు.