శిథిలమవుతున్న లొద్దిగండి చెరువు
ఖమ్మం, జనవరి 30 (): 1000 ఏకరాకు నీరందించాలనే లక్ష్యంతో లొద్దిగండి చెరువు నిర్మించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారుతోంది. చెరువుకు తూములు మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని కొత్తూరు సమీపంలో ఉన్న లొద్దిగండి చెరువును గతంలో కొన్ని రూ. లక్షల వ్యయంతో నిర్మించారు. పర్యవేక్షణ మాత్రం మరిచిపోయారు. కుడికాలువ, ఎడమకాలువ, దగ్గర నున్న తూములు శిథిలమై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేకసార్లు చెరువును మర్మతులు చేయించండని స్థానిక రైతులు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చెరువులోకి వచ్చే నీరు తూముల నుంచి కాలువలకు వెళ్లినా వృధాగా మిగిపోయే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో చెరువులోకి నీరు వచ్చినా పంటలకు మాత్రం ఉపయోగపడడం లేదని. చెరువులో తూటికాడలు సైతం విపరీతంగా పెరిగిందని, దీనివల్ల మత్స్యకారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ మొక్కలను తొలగించాలని రైతులు కోరుతున్నారు. చెరువులో పూడిక సైతం ఎక్కువగా ఉండడం వల్ల లోతు తగ్గే ప్రమాదం ఉంది. చెరువుకట్ట శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో చెరువులోకి నీరు పూర్తిగా వస్తే కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. చెరువుకట్ట లోపలి భాగంలో సైజురాళ్లతో నిర్మిస్తే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందన్నారు.