శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి

విజయవాడ,ఫిబ్రవరి17 (జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సవిూప పుణ్యతీర్థాల్లో స్నానాలు చేసి అర్చనలు, పూజలు చేశారు. అలాగే ప్రత్యేక అభిషేకాలతో శివుడికి పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమరావతిలోని అమరేశ్వరస్వామి ఆలయం, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంతో పాటు ప్రముఖ శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పాదయాత్రగా వచ్చే భక్తులు పరమశివుడిని జపిస్తూ శ్రీశైలానికి చేరుకున్నారు. శ్రీగిరి కొండలన్నీ మల్లన్న భక్తులతో సందడిగా మారాయి. భక్తకోటి నడమ అఖండ బ్రహ్మాండనాయకుడి వేడుకలు అంబరాన్నంటాయి. సకల శుభాలు కలిగించే మలల్లికార్జునస్వామి దర్శనంతో పునీతమయ్యేందుకు భక్తులు సకుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో పాతాళగంగలో పుణ్యస్నానాలాచరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించనున్నారు.శ్రీశైలం మహాక్షేత్రంలో శివరాత్రి బ్ర¬్మత్సవాల సంబరాలు అంబరాన్ని తాకాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంవిూద ఆసీనులైన పార్వతీ, పరమేశ్వరులు శైశ్రైల పురవీధుల్లో విహరించారు. స్వామివార్ల దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్సవంలో అగ్నికీల విన్యాసాలు, కోలాటాలు, చెక్కభజనలు, దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు సందడి చేశారు.

శ్రీకాళహస్తిలో ప్రముఖుల పూజలు

మహాశివరాత్రి బ్ర¬్మత్సవాల్లో భాగంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ

అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. బెంగళూరు నుంచి తెచ్చిన పుష్పాలు, వివిధ రకాల పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఇక శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేలాది మంది భక్తులు ముక్కంటి శ్రీకాళ హస్తీశ్వరున్ని దర్శించుకోవడానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశదర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. వాయులింగేశ్వరుడైన శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకుంటే సకలపాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. కర్ణాటక, తమిళనాడు, ఆంధప్రదేశ్‌, తెంగాణ రాష్టాల్రకు చెందిన భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం 6గంటలకే 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 50వేల మంది భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా లఘుదర్శనం ఏర్పాటు చేశారు.

కృష్ణా జిల్లాలో మహాశివరాత్రి పర్వదినం

సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. విజయవాడ సవిూపంలోని యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మెట్ల మార్గంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ పాతబస్తీలోని పాతశివాలయం, విజయేశ్వరాలయం, వసంత మల్లిఖార్జునస్వామి ఆలయం, సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం భక్తులతో సందడిగా మారాయి. పి.గన్నవరం మండలంలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. వందలాది మంది భక్తులు దేవాలయాల వద్ద అభిషేకాలు నిర్వహించి పరమశివుని సేవలో తరించారు. పి.గన్నవరం, కొందాలపల్లి, మానేపల్లి, నరేంద్రపురం, పారుపల్లి,ముంగండ, బెల్లంపూడి తదితర గ్రామాల్లో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి.  త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందిన కృష్ణాజిల్లాలోని కూడలి దాములూరు వద్ద సంగమేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయం ఎదురుగా ఉన్న నదిలో భక్తులు స్నానమాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.అంబాజీపేట మండంలో ఉన్న పలు గ్రామాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకుమజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని నీలకంఠుడ్ని దర్శించుకున్నారు.

గోదావరి తీరంలో భక్త సందడి

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న శివాలయాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలాచరించి పరమశివుడ్ని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టించిన మాచవరంలోని పార్వతీ రాజేశ్వరస్వామి, వ్యాఫ్రేబిశ్వరలోని బాలాత్రిపురసుందరీ సమేత వ్యాఫ్రేబిశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఇరుసుమంద గంగలకుర్రు అగ్రహారం, ముక్కాముల గ్రామాలు శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా  పిఠాపురం పాదగయలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మహాశివరాత్రి వేడుక నేపథ్యంలో ముందు రోజు సోమవారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం కుక్కుటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాజరాజేశ్వరి, పురుహుతికా అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. ఉపాలయాలను దర్శించుకున్న భక్తులు రోజంతా ఆలయంలో గడిపారు. స్వామిఅమ్మవారి వూరేగింపు జరిగింది. మేళతాళాల మధ్య పురవీధుల గుండా స్వామివారిని వూరేగించారు. కల్యాణం అనంతరం నిర్వహించే ప్రధాన ప్రవేశ తాళిపాక శేష¬మాన్ని నిర్వహించారు. రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్ర చామంతి పూజ జరిగింది.