శిశు విక్రయాన్ని అడ్డుకున్న పోలీసులు
తల్లి ఒడికి చేరిన పసిపాప
యాదాద్రి,ఆగస్ట్3(జనం సాక్షి): యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం చిన్నపలుగు తండాలో శిశు విక్రయం కలకలం రేపుతోంది. భార్యకు తెలియకుండా భర్త భూక్యాశంకర్ తమకు పుట్టిన ఆడశిశువును అమ్మేశాడు. భువనగిరికి చెందిన నరసింహకు రూ.25వేలకు శిశువును విక్రయించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శిశువును అమ్మినవారితో పాటు కొన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లిఒడికి చేర్చారు. ఇటీవల వ్యభియార గృహాలకు అమ్మాయిల అమ్మకాలకు సంబంధించిన దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది. ఇలాంటి విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.