‘శుభ్రులా’

1

– పోరుబిడ్డ విల్సన్‌కు అరుదైన పురస్కారం

– ఇద్దరు భారతీయులకు రామన్‌ మెగసెసె అవార్డు

న్యూఢిల్లీ,జులై 27(జనంసాక్షి): ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌ కాగా, మరొకరు సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ. ఆసియాలో నిస్వార్థ సేవాపరులను గౌరవించటానికి ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.ఈ ఏటి విజేతల విషయానికి వస్తే.. విల్సన్‌ కర్ణాటకలోని దళిత కుటుంబంలో జన్మించారు. మానవహక్కుల కోసం పోరాడే ఆయన హుందాగా జీవించడం ప్రతి మనిషికి జన్మతో వచ్చిన హక్కు అని చాటుతారు. చెన్నైకి చెందిన టీఎం కృష్ణ సంగీత విద్వాంసులు. సంస్కృతిలో సామాజికాంశాలను సమ్మిళితం చేయడాన్ని ఆయన ఇష్టపడతారు. వీరితో పాటు ఫిలిప్పీన్స్‌కి చెందిన కొంచిత కార్పియోమోరల్స్‌, ఇండోనేషియాకు చెందిన డంపెట్‌ దౌఫా తమ తమ రంగాల్లో చేస్తున్న సేవలకు, జపాన్‌, వియత్నాంలకు చెందిన మరో రెండు సంస్థలకు కూడా ఈ అవార్డులు దక్కాయి.