శృతి,సాగర్‌ల ఎన్‌కౌంటర్లపై సమాధానం ఇవ్వాలి: రాములమ్మ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని కాంగ్రెస్‌ నేత విజయశాంతి అన్నారు. అణచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని ఆమె హెచ్చరించారు. వరంగల్‌ బిడ్డలు శృతి, సాగర్‌ల పైశాచిక హత్యలపై కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని రాములమ్మ విమర్శించారు. చంపడం తప్పయితే అందులో ప్రభుత్వాలకు మినహాయింపు లేదని తెలుసుకోవాలని ఆమె సూచించారు.