” శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి అగ్ర తాంబూలం – ప్రభుత్వవిప్ అరికెపూడి గాంధీ”
శేరిలింగంపల్లి, అక్టోబర్ 01( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కీలక భూమికపోషించే శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి అగ్ర తాంబూలం అందిస్తామని… కార్పొరేటర్ సహకారంతో నియోజకవర్గం పరిధిలోనే ప్రథమ స్థానంలో నిలబెడతామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్పష్టంచేశారు. ఈమేరకు డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా 100 ఫీట్ల రోడ్డులో శనివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తోకలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే అభివృద్ధి పనులలో భాగంగా శనివారం దాదాపు 31 లక్షల రూపాయల ప్రభుత్వనిధులతో 100 ఫీట్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టంను వారుప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి అగ్రతాంబూలం అందిస్తానని, ప్రజాదరణ, ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలలో ప్రజా పాలనపట్ల ఉన్న నమ్మకాన్ని మరింత ఇనుమడింప జేయడానికై తాము అవిశ్రాంతంగా పనిచేస్తానని ధీమాను వ్యక్తంచేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధివిషయంలో ఎక్కడా రాజీఉండబోదని, ప్రతి పనిని శాశ్వత ప్రాతిపదికన దశలవారీ కార్యాచరణతో పూర్తి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ రాగం, ఎమ్మెల్యే గాంధీఅన్నారు. కరోనా వంటి విపతర్కపరిస్ధితుల్లోసైతం అభివృద్ధి, సంక్షేమం అగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం రాజీలేకుండా అభివృద్ధిపనులను చేపట్టడం జరుగుతుందని, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న ఆయా అభివృద్ధిపనులు త్వరితగతిన పూర్తిఅయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, ప్రజావసరాల దృష్ట్యా త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటలోకి తీసుకురావాలని వారు ఆదేశించారు. వీధిదీపాల ద్వారా వంద ఫీట్లరోడ్డుపై వెళ్లే వాహనాలకు చీకటిసమయంలో ఎటువంటి ఇబ్బందిలేకుండా సాఫీగా ప్రయాణంసాగేలా వీధిదీపాలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. రోడ్డుపక్కనగల కాలనీలకీ కొత్తశోభ వచ్చిందని, వీధిదీపాల వెలుగులు, ప్రకాశవంతమైన కాంతులు కాలనీలలో విరాజిల్లుతూ కాలనీకి కొత్తశోభను అద్దినట్టయ్యిందన్నారు. రాత్రిసమయంలో వాహన దారులకు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా తోడ్పడుతాయని, అన్ని రకాల మౌలిక వసతులకల్పనకు కృషిచేస్తానని, శేరిలింగంపల్లి డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయశేక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో స్ట్రీట్ లైట్ EE ఇంద్రదిప్, DE మల్లికార్జున్ , AE రాజశేఖర్ మరియు శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షలు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, సురేందర్, MD ఇబ్రహీం, రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పవన్, రమణ, రామకృష్ణ, గోపాల్ యాదవ్, జమ్మయ్య, రవికుమార్, రాంచందర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.