శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులు
మల్దకల్ జూన్ 23(జనంసాక్షి)
బిజెపిరాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు గురువారం భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి మల్దకల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం జరిగిన రోజు 23 జూన్ 1953 ఈ దేశంలో రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు, 2 రాజ్యాంగాలు నడువవు అని జమ్మూ కాశ్మీర్ యాత్ర కు బయల్దేరిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ ని కాశ్మీర్లో అరెస్టు చేసి ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన ఆహారం మందులు అందకపోవడం వల్ల వారు అమరులయ్యారు.
భారతీయ జనతా పార్టీలో బూతు స్థాయిలలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం ప్రతి పోలింగ్ బూతు లో వారికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రామకృష్ణ,మాజీ సర్పంచ్ దామనాగరాజు,దామ వెంకటేష్ ,మండల ప్రధాన కార్యదర్శికాంట్రాక్టు గోవిందు, మాజీ ఎంపీటీసీ రాముడు,తిమ్మప్ప,గోవర్ధన్,యూత్ అధ్యక్షుడు లక్మి నారాయణ, తిరుమలేష్, రాము,తదితరులు పాల్గొన్నారు.