శ్రీకృష్ణాష్టమి సందర్భం గా కృష్ణాలయం లో ప్రత్యేక పూజలు….

చుట్టూ పక్క గ్రామాల నుంచి తరలి వస్తున్న భక్తులు….

ప్రశాంత వాతావరణంలో వేణుగోపాలస్వామి దర్శనం….

ములుగు,జనం సాక్షి :-

శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ములుగు వెంకటాపూర్ నల్లగుంట గ్రామంలో శుక్రవారం, శనివారం రోజులలో ఘనంగా పూజలు నిర్వహించుటకు గ్రామ గుడి కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది.శుక్రవారం ఉదయం శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.శనివారం ఉదయం శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు,శ్రీకృష్ణ భజనలు కార్యక్రమం,అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం మరియు పోలు ఎక్కే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ గ్రామ గుడి కమిటీ చైర్మన్ మందల మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఫస్ట్, సెకండ్ ప్రైజులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలపడం జరిగింది గ్రామ ప్రజలు చుట్టుపక్క ప్రజలు శ్రీకృష్ణుని దర్శనం కోసం తరలివస్తున్నారని ఇంకా అధిక సంఖ్య లో దర్శనం చేసుకోవలని గ్రామ గుడి కమిటీ తెలియజేశారు.గుడి పూర్తి అయిన తర్వాత
మొదటి సారి నిర్వహించే వేడుకలు అని గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి అన్నారు.భక్తులు అధిక సంఖ్య పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో
ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి,పెంచాల దీపక్,కోశాధికారి మందల ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రామగిరి శ్రీనివాస్,సభ్యులు ప్రేమ్ సాగర్,మందల చిన్న వెంకట రమణ రెడ్డి,మాజీ ఎంపీటీసీ చర్లపల్లి సునీత సతీష్,ఉప సర్పంచ్ భూక్యా శంకర్,పులి మధుసూదన్ రెడ్డి,రెడ్డి నరసయ్య, పోలుదాసరి రవి,సకినపెల్లి మురళి,ఇటుకాల బద్రి,కారుపోతుల యాదగిరి,మందల ప్రభూరెడ్డి,మందల కృష్ణారెడ్డి,తంగళ్ళపెల్లి శ్రీధర్,తడక రవి,పబ్బ శంకరయ్య, ఈసి సురేష్ తదితరులు పాల్గొన్నారు.