శ్రీపతి రాజేశ్వర్‌కు నివాళి అర్పించిన తెదేపా అధినేతలు

హైదరాబాద్‌: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.