శ్రీరాంహిల్స్ కాలనీని సందర్శించిన మంత్రి తుమ్మల
ఖమ్మం,మార్చి3(జనంసాక్షి): అర్బన్ నగరంలోని శ్రీరాంహిల్స్ కాలనీని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సందర్శించారు. వర్తకసంఘం వజ్రోత్సవాల సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహారవిందులో మంత్రి పాల్గొన్నారు. కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, వర్తకసంఘం అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాలనీ రెసిడెన్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నమండవ సర్పంచి తెరాసలో చేరికచింతకాని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సమక్షంలో చిన్నమండవ సర్పంచి అంజమ్మ మంగళవారం తెరాసలో చేరారు. గ్రామానికి చెందిన 100మంది తెదేపా కార్యకర్తలు తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి వీరంతా తెరాసలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, తెరాస నాయకులు బొమ్మెర రామ్మూర్తి, బద్కగ్ పాల్గొన్నారు.