శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ దంపతులు..

-శ్రీ జమదాగ్ని సమేత శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవము ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు…
గద్వాల రూరల్ ఆగష్టు ‌23 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ జమదగ్ని సమేత శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవము  సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల  జ్యోతి కృష్ణ మోహన్ రెడ్డి అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు  సమర్పించారు.దేవాలయంలో ఎమ్మెల్యే  గారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి & శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దంపతులు బియస్ కళావతి కేశవ్ వేద పండితులు చే సాంప్రదాయబద్ధంగా శ్రావణమాసం చివరి మంగళవారం పురస్కరించుకొని పచ్చటి పందిరిలో లోక జనని జమదగ్ని *సమేత శ్రీ జమ్ములమ్మ అమ్మ వారి కళ్యాణోత్సవము* కళ్యాణం కమనీయం మంగళ వాయిద్యాలతో నిర్వహించడం జరిగినది.ఎమ్మెల్యే దంపతులను ఆలయ ఛైర్మన్ ,ఈఓ శాలువాతో సత్కరించారు..ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…నడిగడ్డ ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం   గత సంవత్సరం అంగరంగ వైభవంగా  నిర్వహించడం జరిగింది..జములమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తమ మొక్కలను తీర్చుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు ఈ జములమ్మ అమ్మవారిని దర్శించుకుని విచ్చేస్తుంటారు వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ భవిష్యత్తులో జములమ్మ అమ్మవారు పుణ్యక్షేత్రంగా ఏర్పడే విధంగా ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని తెలిపారు.అదేవిధంగా జమ్మలమ్మ దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అష్టం 18 పీఠాలతో  నిర్మాణం కాబోతున్నాయి త్వరలోనే  ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు.జాతరకు, కళ్యాణోత్సవము  వచ్చే భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా‌ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం, నడిగడ్డ ప్రాంతం  రైతులకు సకాలంలో వర్షాలు పండాలి. రైతుల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావాలి, రైతు అభివృద్ధి చెందాలి, కేసీఆర్ కలగన్న రైతే రాజు త్వరగానే నెరవేరాలి. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగినది…దేవాలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో  జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ,
ఎంపీపీ లు విజయ్, రాజారెడ్డి,మనోరమ్మ, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు,  ఆలయం కమిటీ చైర్మన్ సతీష్, కౌన్సిలర్స్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆలయం కమిటీ డైరెక్టర్స్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.