శ్రీ కట్టమైసమ్మ ఆలయ చెత్తు నిర్మాణం కోసం 6 లక్షల విరాళం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 16(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పాత కుంట ఆదర్శనగర్ లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం చెత్తు నిర్మాణం కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ 6 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఆదివారం శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి చెత్తు నిర్మాణం పనులకు పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితం కట్ట మైసమ్మ తల్లి అన్నారు. ఆదర్శనగర్ పాతకుంటలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 6కోట్లతో పార్క్ నిర్మాణం పనులు చెపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింధు కళాశాల నుండి చిలుక వాగు వరకు 60 ఫీట్ల రోడ్డు సైడ్ డ్రైనేజీ పనులు 16 కోట్లతో మునుగోడు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
అనంతరం కమిటీ సభ్యులు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణంలో భాగంగా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు రాములు, నల్ల పాపయ్య ,వేణుగోపాల్ ,కటకం రమేష్ ,సుధాకర్ ,రాజేష్ ,నర్సింహులు ,కృష్ణ, నాగప్ప ,సుధాకర్ ,ఇంజనీర్ గోపాలకృష్ణ, ఆలయ పూజారి రాములు తదితరులు పాల్గొన్నారు.
Attachments area