*శ్రీ తిరుమలయ్యస్వామి వారి సన్నిధిలో అమావాస్య పూజలు*

ఇటిక్యాల జూన్ 28 : (జనంసాక్షి) మండల పరిధిలోని చాగాపురం  గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ తిరుమలయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అమావాస్య పురస్కరించుకొని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే తీర్థప్రసాదాలు స్వీకరించే గ్రామస్థుల సహకారంతో అన్నదాన కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు ప్రజలు పాల్గొన్నారు.