శ్రీ మల్లికార్జున స్వామి చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా కమటం వేణుగోపాల్ 

శ్రీ మల్లికార్జున స్వామి చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా కమటం వేణుగోపాల్ వరంగల్ ఈస్ట్, మార్చి 27 (జనం సాక్షి)హైదరాబాద్ శివరు గజ్వేల్ సమీపంలో మామిడిపల్లి లక్ష్మక్క పెళ్లిలోని విపిజ్ ఫంక్షన్ హాల్ లో శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా కమటం వేణుగోపాల్ పటేల్ ని నియమిస్తూ నియామక పత్రాన్ని కమటం వేణుగోపాల్ పటేల్ కు గౌరవ అధ్యక్షులు ఆకుల రాజయ్య పటేల్, వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు రవీందర్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవనం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు రవీందర్ పటేల్ మాట్లాడుతూ భవన నిర్మాణానికి మున్నూరు కాపులు అందరూ వారికి తోచిన విధంగా విరాళాలు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణలోని పలు జిల్లాల నుండి మున్నూరు కాపులు ప్రముఖులు పుట్ట పురుషోత్తం పటేల్, ఆకుల స్వామి వివేక్ పటేల్, బొల్లం లింగమూర్తి పటేల్, నాసం రాజు పటేల్, మున్నూరు కాపులు పాల్గొన్నారు.