శ్రీ మహాలక్ష్మిదేవిగా సంతోషిమాత

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక సంతోషిమాత దేవాలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకరణ దాతలు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు.నవరాత్రుల సందర్భంగా చండీ హోమం,రుద్ర హోమం నిర్వహించారు.ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యములతో అర్చనలు నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష , కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్త, మురళీధర్,ఉపాధ్యక్షులు విద్యాసాగర్ రావు, అన్నదాన నిర్వాహకులు కొత్త మల్లికార్జున్,కమిటీ సభ్యులు బ్రహ్మయ్య , శ్రీశైలం,పాపిరెడ్డి,సోమయ్య , అర్చకులు మంగిపూడి వీరభద్ర శర్మ , బాబ్జి శర్మ ,అలంకరణ భక్తులు రాచర్ల వెంకటేశ్వరరావు,పాటి రమేష్ రెడ్డి,రాచర్ల కమలాకర్, లకుమారపు పద్మ, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.ఈ నెల 5న విజయదశమి సందర్భంగా స్థానిక జమ్మిగడ్డలోని జడ్పీ కార్యాలయంలో సంతోషిమాత దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శమి పూజ కార్యక్రమంలో పాల్గొనవల్సిందిగా కోరుతూ క్యాంపు కార్యాలయంలో దేవాలయ కమిటీ సభ్యులు మంత్రి జగదీష్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.