శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవం

రంగురంగులతో ఆలయం ముస్తాబు
 15 నుంచి 17 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు
17వ తేదీన స్వామి వారి కళ్యాణ మహోత్సవము
వేద పండితులు బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీ రామ్ శరణ్​ శర్మతో ప్రత్యేక పూజలు
  పరిగి రూరల్, అక్టోబర్​ 13 ( జనం సాక్షి  ) :  వికారాబాద్ జిల్లా
 పరిగి మున్సిపల్ లోని  తెలంగాణ చౌరస్తా వద్ద ధర్మశాల ఉన్న స్థలంలో గత ఏడాది సుమారు అరకోటితో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ప్రథమ వార్సికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్త  ఎదిరె సత్యనారాయణ అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. ఈ వార్షికోత్సవ మహోత్సవ పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీ రామ శరన్ శర్మ  సిధ్దాంతి పార్థ సారధి పండితులచే నిర్వహించనున్నారు.
మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు
ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో మొదటి రోజు ఈ నెల 15వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు మంగళ వాయిద్య సంఘోషం, వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన దీక్ష ధారణ, బుత్వికవరణము, అఖండ దీపారాధన, చక్రరాజ అర్చన, నీరాజన మంత్ర పుష్పం సాయంత్రం 4.30 గంటల వేద స్వస్తి మృత్సంగ్రహణ అంకురారోషన, సుదర్శనమహా మంటలప అవాహన, 16 వతేదీన ఉదయం 8 గంటలకు  ఆదివారం
వేద స్వస్తి గవ్యాంత పూజలు, వాస్తు పూజ, పాత్ర రౌపాసన , వాస్తు బలి, శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి వారికి విశేష ద్రవ్య అష్టోత్తర శత కళశాభిషేకం, నీరాజనం, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగము సాయంత్రం 4.30 గంటలకు వేద స్వస్తి సాయమౌపాసన విష్ణుసహస్ర నామ సహిత లక్ష్మీ నరసింహా స్వామి మూల మంత్ర హవనములు, విశేష స్రనామ పుష్పార్చన నిత్య బలిహారణం, నీరాజనం, 17వ తేదీన సోమవారం ఉదయం 8 గంటలకు వేదస్వస్తి గవ్యాంత పూజలు, సుదర్శన మూలు మంత్ర హవనములు, మహా పూర్ణాహుతితోపాటు ఉదయం 10.30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం కన్నుల పండుగగా స్వామి ఊరేగింపు ఉంటుంది. ఈ మూడు రోజులు వార్సికత్సవ వేడుకలను భక్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని నిర్వహాకులు ఎదిరె సత్యనారాయణ, ఎదిరె కృష్ణ, ఎదిరె నరేందర్​ తదిరులు కోరారు.
ఆలయ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం  : ఎదిరె సత్యనారాయణ ( ఆలయ ధర్మకర్త– ఆర్య వైశ్య సంఘం నాయకులు)
పరిగి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించాలన్నది నా చిరకాల కోరిక నెరవేరి ఏడాది పూర్తైంది. ఆలయ మొదటి వార్​షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముచ్చటగా మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలకు భక్తలుఉ పెద్ద సంఖ్యలో హాజరు కావాలి. కళ్యాణ మహోత్సవం, స్వామి వారి ఊరేగింపు ఈ వార్షికోత్సవ వేడుల్లో పాల్గొని స్వామి వారికి కృపకు పాత్రలు కావాలి
ఫోటో రైటప్ :
13 పిఆర్జి 01లోమొదటి వార్షికోత్సవానికి ముస్తాబవుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము
02లో ఎదిరె సత్యనారాయణ ( ఆలయ ధర్మకర్త– ఆర్యవైశ్య సంఘం నాయకులు )