శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

రాజంపేట్ (జనంసాక్షి) నవంబర్
15

రాజంపేట్ మండల కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మొదట జవహర్లాల్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు అలాగే చిన్నారులు వేసిన జాతీయ నాయకుల వేషధారణలు సందర్భంగా స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హర్షిత కర్వాచారిగా భానుప్రసాద్ ఉపాధ్యాయులుగా వైష్ణవి హరిణి దీపిక మణికంఠ రేహాన్ స్వతిక్ సాయికుమార్ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం పాండరీనాథ్ హనుమంతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి రజిని సమీరా సుషిత సోనిప్రియ తదితరులు పాల్గొన్నారు