శ్రీ సత్య సాయి సేవ సంస్థల ఆధ్వర్యంలో 70 మందికి కంటి అద్దాలు పంపిణీ
మంగపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి అధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 70 మందికి కంటి అద్దాల పంపిణీ చేశామని,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మంగపేట మండల అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న స్ఫూర్తితో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు ప్రజలకు ఉచిత సేవలు అందజేస్తున్నారు అన్నారు.మంగపేట మండలం లో ఉచితముగా196 మందికి కంటి పరీక్షలు నిర్వహించి,వారిలో 70 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం,34 మందికి కాటరాక్టు చికిత్సలు చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలియ జేశారు.ఈ వైద్య శిబిరం లో సేవలను అందించిన డాక్టర్లకు, సేవా సంస్థల సభ్యులకు, మంగపేట గ్రామ పెద్దలు కుడుముల లక్ష్మినారాయణ, శ్రీహరి, వెంకటేష్, సత్యం, అలాగే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన జడ్పీఎస్ ఎస్ పాఠశాల మంగపేట ఉపాధ్యాయ బృందానికి శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉంటాయి అని సంతోషంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, ఇమ్మడి క్రాంతి,డా.రవీందర్, ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొనీ విజయవంతం చేశారు.