షార్ట్ సర్య్కూట్‌తో ఇల్లు దగ్ధం- భారీ నష్టం
చందుర్తి,మే26(జనంసాక్షి):
చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్య్కూట్ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి లింగారెడ్డి అప్పులతో స్వంత ఇల్లు అమ్ముకున్నాడు. మర్రి భూమరాజం పనులకోసం వలస వెళ్లాడు. భూమరాజం ఇంట్లో కిరాయిగా మర్రి లింగారెడ్డి బతుకున్నాడు. కరెంట్ షార్ట్ సర్య్కూట్ జరగా మంటలు రేగాయి. ఇంట్లో టీవీ, నాలుగువేలు నగదు, బట్టలు, వస్తువులు దగ్దం అయింది. మంటలు అదుపులోకి రాక ఇరుగు పోరుగులు నీళ్లు చల్లారు. అటువైపుగా ట్రాక్టర్ నీటి ట్యాంకర్ వస్తుండగా మండల పరిషత్ మాజీ ఉపా ద్యాక్షులు తిప్పని శ్రీనివాస్ ఆగి స్థానాకులతో మంటలపై నీళ్ల చల్లారు. ఇంటి పైకప్పువాసాలు, దర్వా జలు దహనం అయింది. ఈ సంఘటనలో దాదాపు లక్ష రుపాయల ఆర్థిక నష్టం జరిగింది. ప్రభుత్వ పరంగా ఆధుకోవాలని బాధితుడు లింగారెడ్డి కోరుతున్నాడు. చందుర్తి మం డలకేంద్రంలో మాజీ సర్పం చ్ మార్త శివవ్వసత్తయ్య వ్యవసాయ భూముల్లో నిల్వ చేసిన పశుగ్రాసానికి అగ్గి అంటి దగ్ధం అయింది.