షిండేతో సీఎం సమావేశం
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్ర హోంమంత్రి షిండేతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై అరగంట పాటు చర్చించారు. అంతకు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.